చంద్రఘంట మాత

అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మూడవ అవతారం చంద్రఘంట

3. చంద్రఘంట

ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు ‘చంద్రఘంట’ యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు గడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

Know More దుర్గాదేవి నవరాత్రి

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది. అమ్మ వారి మూడవ అవతారం చంద్రఘంట. అమ్మవారిని చంద్రఘంటా అనగా గాయత్రీ శ్రీదేవి రూపంముగా గ్రే కలర్ లో అలంకరిస్తారు. ఈ అమ్మవారు, మన బాధలు, కష్టాలు తీర్చి, మన కోరికలు తీర్చుతుందని ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ దేవి మాతకు నైవేద్యంగా పాలు లేదా పాయసం సమర్పించుకుంటారు.

చంద్రఘంటేతి ధ్యాన శ్లోకం :

” పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥”

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

See also  దుర్గాదేవి నవరాత్రి

You may also like these

error: Content is protected !!