Masik Shivaratri 2024
మాస శివరాత్రి 2024
శివరాత్రి అంటే ఏమిటి?
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.
చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.
తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.
ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి. దీపాలను పడమర దిక్కున వెలిగించి “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.
శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి. దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు. తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.
Know More Shiva Panchakshara Stotram, Shiva Tandava Stotram, Daridrya Dahana Shiva Stotram, Shivaaya Gurave Namaha, Shiva Dwadasa Nama Stotram, 24 Shiva Abhishekam.
అసలు ఈ రోజున ఏం చేయాలి?
శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.
ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వదళాలను శివునికి అర్పించాలి.
ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.
ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.
కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి.
Maha Shivaratri Important Timings on Friday, March 8, 2024
Chaturdashi Tithi Begins: 09:57 PM on Mar 08, 2024
Chaturdashi Tithi Ends: 06:17 PM on Mar 09, 2024
Nishita Kaal Puja Time: 12:07 AM to 12:56 AM, Mar 09 (49 Mins)
1’st Prahar Puja Time : 06:25 PM to 09:28 PM
2’nd Prahar Puja Time : 09:28 PM to 12:31 AM, Mar 09
3’rd Prahar Puja Time : 12:31 AM to 03:34 AM, Mar 09
4’th Prahar Puja Time : 03:34 AM to 06:37 AM, Mar 09
Maha Shivaratri Parana Time : 9th Mar, 06:37 AM to 03:29 PM
శివుడుకి వివిధ రకాల అభిషేకాలు, మరియు వాటి ఫలితములు
1. పుష్పోదకము చేత అభిషేకించిన భూ’లాభము కలుగును.
2. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
3. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
4. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
5. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
6. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
7. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
8. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు.
9. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
10. భాస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
11. మామిడి పండ్ల రసము చేత అభిషేకము ధీర్ఘ వ్యాధులు నశించును.
12. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
13. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
14. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
15. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
16. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
17. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
21. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
22. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
23. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
24. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.
Below the list of Masik Shivaratri in 2024 as per South India Timing’s.
Masik Shivaratri in January 2024 | |
Date : January 9, 2024 (Tuesday) Puja Time : Jan 09, 12:01 am to Jan 10, 12:55 am (54 Mins) | ⚫ (Pushya) Krishna Chaturdashi Tithi Begins : Jan 09, 10:24 pm Tithi Ends : Jan 10, 08:10 pm |
Masik Shivaratri in February 2024 | |
Date : February 8, 2024 (Thursday) Puja Time : Feb 09, 12:09 am to Feb 09, 01:01 am (52 Mins) | ⚫ (Magha) Krishna Chaturdashi Tithi Begins : Feb 08, 11:17 am Tithi Ends : Feb 09, 08:02 am |
Maha Shivaratri & Masik Shivaratri in March 2024 | |
Date : March 8, 2024 (Friday) Puja Time : Mar 09, 12:07 am to Mar 09, 12:56 am (49 Mins) | ⚫ (Phalguna) Krishna Chaturdashi Tithi Begins : Mar 08, 09:57 pm Tithi Ends : Mar 09, 06:17 pm |
Masik Shivaratri in April 2024 | |
Date : April 7, 2024 (Sunday) Puja Time : Apr 08, 12:00 am to Apr 08, 12:45 am (45 Mins) | ⚫ (Chaitra) Krishna Chaturdashi Tithi Begins : Apr 07, 06:53 am Tithi Ends : Apr 08, 03:21 am |
Masik Shivaratri in May 2024 | |
Date : May 6, 2024 (Monday) Puja Time : May 06, 11:56 pm to May 07, 12:39 am (42 Mins) | ⚫ (Vaishakha) Krishna Chaturdashi Tithi Begins : May 06, 02:40 pm Tithi Ends : May 07, 11:40 am |
Masik Shivaratri in June 2024 | |
Date : June 4, 2024 (Tuesday) Puja Time : Jun 04, 11:59 pm to Jun 05, 12:40 am (40 Mins) | ⚫ (Jyeshtha) Krishna Chaturdashi Tithi Begins : Jun 04, 10:01 pm Tithi Ends : Jun 05, 07:54 pm |
Masik Shivaratri in July 2024 | |
Date : July 4, 2024 (Thursday) Puja Time : Jul 05, 12:06 am to Jul 05, 12:46 am (40 Mins) | ⚫ (Ashadha) Krishna Chaturdashi Tithi Begins : Jul 04, 05:54 am Tithi Ends : Jul 05, 04:57 am |
Masik Shivaratri in August 2024 | |
Date : August 2, 2024 (Friday) Puja Time : Aug 03, 12:06 am to Aug 03, 12:49 am (42 Mins) | ⚫ (Shravana) Krishna Chaturdashi Tithi Begins : Aug 02, 03:26 pm Tithi Ends : Aug 03, 03:50 pm |
Masik Shivaratri in September 2024 | |
Date : September 1, 2024 (Sunday) Puja Time : Sep 01, 11:58 pm to Sep 02, 12:44 am (45 Mins) | ⚫ (Bhadrapada) Krishna Chaturdashi Tithi Begins : Sep 01, 03:40 am Tithi Ends : Sep 02, 05:21 am |
Masik Shivaratri in September 2024 | |
Date : September 30, 2024 (Monday) Puja Time : Sep 30, 11:47 pm to Oct 01, 12:35 am (48 Mins) | ⚫ (Aswayuja) Krishna Chaturdashi Tithi Begins : Sep 30, 07:06 pm Tithi Ends : Oct 01, 09:39 pm |
Masik Shivaratri in October 2024 | |
Date : October 30, 2024 (Wednesday) Puja Time : Oct 30, 11:39 pm to Oct 31, 12:31 am (52 Mins) | ⚫ (Kartika) Krishna Chaturdashi Tithi Begins : Oct 30, 01:15 pm Tithi Ends : Oct 31, 03:52 pm |
Masik Shivaratri in November 2024 | |
Date : November 29, 2024 (Friday) Puja Time : Nov 29, 11:43 pm to Nov 30, 12:37 am (54 Mins) | ⚫ (Margashirsha) Krishna Chaturdashi Tithi Begins : Nov 29, 08:39 am Tithi Ends : Nov 30, 10:29 am |
Masik Shivaratri in December 2024 | |
Date : December 29, 2024 (Sunday) Puja Time : Dec 29, 11:56 pm to Dec 30, 12:51 am (55 Mins) | ⚫ (Pausha) Krishna Chaturdashi Tithi Begins : Dec 29, 03:32 am Tithi Ends : Dec 30, 04:01 am |
** ** **